బెంగళూరులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై యువతిని కిరాతకంగా కత్తితో నరికాడు. పెళ్లికి ఒప్పుకోలేదని మాజీ ప్రియుడే ఆమెను క్రూరంగా 16 కత్తిపోట్లతో హతమార్చాడు. మృతురాలిని లీలా పవిత్రగా గుర్తించారు. ఈమె స్వస్థలం కాకినాడ. గత ఐదేళ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ప్రేమిస్తున్నానని ఓ యువకుడు ఈమె వెంట పడి వేధిస్తున్నాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో అత్యంత దారుణంగా రోడ్డుపై హత్య చేశాడు. ఆమె పనిచేసే ఆఫీసు పక్కనే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.