దేశ వ్యాప్తంగా 240కిపైగా రైళ్లు రద్దు

భారతీయ రైల్వే శుక్రవారం దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్‌, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నేడు బయలుదేరాల్సిన మరో 87 రైళ్లను పాక్షికంగా రద్దుచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో కాన్పూర్‌, అసన్‌సోల్‌, ఢిల్లీ, లక్నో, బొకారో స్టీల్‌ సిటీ, బక్సర్‌, అమరావతి, వాద్రా, నాగ్‌పూర్‌, పుణె, పఠాన్‌కోట్‌, మదురై, రామేశ్వరంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు ఉన్నాయి. రైళ్లు రద్దయిన నేపథ్యంలో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా రైళ్లలో ముందుగానే టికెట్‌ బుక్‌చేసుకున్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. అయితే తాము వెళ్లాల్సిన రైలు.. రద్దయిన వాటి జాబితాలో ఉందో లేదో ఒక చెక్‌చేసుకోవాలని చెప్పారు.

Related Articles