నేడు, రేపు పలు రైళ్లు రద్దు

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిన్న పట్టాలు తప్పిడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మరమ్మతు పనుల్లో కొన్ని వందల మంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను పాక్షికంగానూ.. మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. ఏ ఏ రైళ్లను పాక్షికంగా.. అలాగే పూర్తిగా రద్దు చేసిందో తెలియజేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనను విడుదల చేసింది. మరో వైపు విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. గోదావరి ఎక్స్‌ప్రెస్ ఘటనతో రైల్వే అధికారులు పలు రైళ్లను రీషెడ్యూల్‌ చేయడంతోపాటు మరికొన్ని రైళ్లను రద్దుచేశారు. పలు రైళ్లను దారిమళ్లించారు. దీంతో విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్‌ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభమైంది. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా మధ్యాహ్నం 5 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది.

Related Articles