రూ.వెయ్యి కోట్లు దాటిన పఠాన్‌ వసూళ్లు

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్ల వసూళ్లను దాటి రికార్డు సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 36 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.528.06 కోట్లు నెట్ వసూలుచేసింది. ఇందులో రూ.18.22 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, రూ.1024.50 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ.139 కోట్లతో అమెరికాలో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా ‘పఠాన్‌’ నిలిచింది. ఇక తాజా వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో వెయ్యికోట్ల మైలురాయిని దాటిన ఐదో చిత్రంగా ‘పఠాన్‌’ నిలిచింది. అంతకు ముందు దంగల్‌, బాహుబలి-2, కేజీఎఫ్‌-2, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు వెయ్యికోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు నమోదు చేశాయి.

Related Articles