ప్రముఖ నటదర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ కన్నుమూత

బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ కన్నుమూశారు. 67 ఏళ్ల కౌశిక్‌ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. మరణం ఈ ప్రపంచంలో మరణం అనేది అంతిమమని నాకు తెలుసు. కానీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ సతీశ్‌ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదు. 45 ఏళ్ల తమ స్నేహం ఈరోజుతో ముగిసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. సతీశ్‌ కౌశిక్‌ గతంలో కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.

Related Articles