అదే స్టేడియంలోకి… కొత్త పాత్రలో…

క్రికెట్‌ మక్కా.. లార్డ్స్ మైదానం.
ఎలాంటి క్రికెటర్‌కైనా ఈ మైదానంలో ఆడటం ప్రత్యేకం. అందుకే ప్రతి క్రికెటర్‌కు లార్డ్స్‌లో ఆడిన మధుర క్షణాలు కలకాలం గుర్తిండి పోతాయి. ఇక బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీకి ఈ మైదానమంటే ప్రాణం. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌గా 2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకుని…చొక్కా విప్పి సందడి చేశారాయన. సౌరవ్‌ ఇవాళ ఆ స్టేడియంకు వెళ్ళగానే పాత మధుర స్మృతులు గుర్తుకు వచ్చాయేమో… వెంటనే మిత్రులతో కలిసి ఫొటో దిగి ట్వీట్ చేశారు. గతంలో ఆటగాడిగా స్టేడియంలో అడుగు పెట్టిన గంగూలీ ఈసారి కొత్త పాత్రలో అంటే బీసీసీఐ అధ్యక్షుడి పాత్రలో లార్డ్స్‌కు వచ్చారు. మిత్రులు అరుణ్‌ సింగ్‌ ఠాకూర్‌, బీసీసీఐ కార్యదర్శి, హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జయ్‌ షాతో దిగిన సెల్ఫీని ట్వీట్‌ చేశారు గంగూలీ.

Related Articles