డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్‌: 1,817 ఖాళీలు

రక్షణశాఖకు చెందిన డీఆర్‌డీఓ సెప్టామ్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రారంభించనుంది. ఈదఫా 1817 ఉద్యోగాలను దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుంది. డిసెంబర్‌ 23వ తేదీ తరవాత ఈ ప్రక్రియ ప్రారంభమౌతోంది. కాబట్టి అభ్యర్థులు ఈనెల 23వ తేదీ తరవాత ఈ విభాగం వెబ్‌సైట్‌ drdo.gov.inను సందర్శించి.. దరఖాస్తు చేసుకోండి.
పదవ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్నవారు డీఆర్‌డీఓ సెప్టామ్‌ ఎంటీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ల పాల్గొనవచ్చు.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు. ..1.817
ఎస్సీలకు… 163
ఎస్టీలకు… 114
ఓబీసీలకు… 503
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు… 188
జనరల్‌ కేటగిరి… 849
మాజీ సైనికులకు… 135
ఎంఎస్‌పీ వర్గాలకు… 50
పీడబ్ల్యూడీ… 19

ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది…
కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో అభ్యర్థికి వచ్చిన మార్కులను బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

జీతం…

జీతం.. లెవన్‌ 1 (Rs 18,000 – 56,900) 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్‌ ఆధారంగా, ప్రభుత్వం ప్రకటించే ఇతర అలవెన్సులు
దరఖాస్తు ఫీజు..
జనరల్‌ కేటగిరి రూ. 100
రిజర్వు కేటగిరీలకు లేదు

గుర్తు పెట్టుకోవాల్సిన కీలక తేదీలు:

ఆన్‌లైన్‌ అప్లికేషన్ల ప్రారంభం… డిసెంబర్‌ 23
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 23,2020
అర్హతలకు కీలక తేదీ… జనవరి 23,2020

Related Articles