వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కింద పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను రక్షణ శాఖ చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెన్షనర్ల బకాయిలకు సంబంధించిన కేసును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ విచారించింది. బకాయిలు చెల్లించాలని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని, అయినా రక్షణ శాఖ వాయిదా వేయడంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పొరపాటును రక్షణ శాఖ వెంటనే సవరించుకోవాని లేదంటే కోర్టు ధిక్కరణ నోటీసు ఇస్తామని హెచ్చరించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కింద బకాయిలు చెల్లించడంలో రక్షణ శాఖ తీవ్ర జాప్యం చేస్తోందని… ఈ విధానం అమల్లోకి వచ్చాక 4 లక్షల మంది పెన్షనర్లు బకాయిలు తీసుకోకుండానే మరణించారని పెన్షనర్ల లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. బాకియలు చెల్లించాలని 22022 మార్చి 16వ తేదీన కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా మూడు సార్లు వాయిదా వేయడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 9 శాతం వడ్డీతో బకాయిలను చెల్లించాలని ఆదేశించింది.
Related Articles
‘అమరరాజా’ వాదనలు వినండి
- February 21, 2023
అజహరుద్దీన్‌కు సుప్రీం షాక్
- February 14, 2023
EWS రిజర్వేషన్లు సబబే
- November 7, 2022
సెక్షన్ 66A: రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
- August 2, 2021