ఉత్తరాదిలోనూ పాల ధరలు పెరుగుతున్నాయి. దక్షిణ మార్కెట్లో నెల రోజుల క్రితమే పాల ధరను పెంచేశాయి కంపెనీలు. అమూల్ పాలు మాత్రం పాత ధరకే లభించేంది. ఇపుడు ఢిల్లీ మార్కెట్లో మదర్ డెయిరీ పాల ధరలను పెంచడంతో… అమూల్ కూడా ధరలను పెంచింది. ఆదివారం నుంచి మదర్ డెయిరీ పాల ధర లీటర్కు రూ. 3 చొప్పున పెంచింది. దీంతో అమూల్ కూడా ఆదివారం నుంచే ధరను పెంచుతోంది. లీటరుకు రూ.2 మాత్రమే తాము పెంచుతున్నామని అమూల్ పేర్కొంది. ఇక నుంచి అమూల్ గోల్డ్ అర లీటరు రూ. 28, అమూల్ తాజా అర లీటర్ రూ. 22లకు విక్రయిస్తారు. అమూల్ శక్తి పాల ధర మాత్రం పెంచలేదు. ఈ పాలను లీటర్కు రూ. 25 చొప్పున అమూల్ అమ్ముతోంది.