ఏపీ ప్రభుత్వానికి ‘అమూల్‌’ దెబ్బ

అమూల్‌తో కుదుర్చుకున్న ఎంవోయూ అమలు కోసం ఎలాంటి ప్రభుత్వ నిధులు వెచ్చించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎంపీ రఘు రామకృష్ణ రాజు పిటిషన్‌ వేశారు. పిటీషన్‌పై కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. రాజు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. వాదనలు విన్నాక ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అమూల్‌తో పాటు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు కూడా నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఒప్పందం పూర్తి పత్రాలను కోర్టు సమర్పించాలని ఆదేశిస్తూ ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Related Articles