సీఏఏ: సుప్రీంలో కమల్‌ పార్టీ పిటీషన్‌

పౌరసత్వ సవరణ చట్టానికి (సీపీఏ) వ్యతిరేకంగా నటుడు, రాజకీయనేత కమల్‌హాసన్ సారథ్యంలోని మక్కల్ నీథి మైయం (ఎంఎన్ఎం) పార్టీ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేసింది. చట్టంలోని సవరణలు కేవలం మతపరమైన మైనారిటీలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నాయని, భాషాపరమైన మైనారిటీలను మినహాయిస్తోందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగవ్యతిరేకమని ఎంఎన్ఎం ఆ పిటిషన్‌లో పేర్కొంది. మతం ఆధారంగా వర్గీకరణ సరికాదని, ఇది రాజ్యాంగంలోని 14, 21వ అధికరణలను ఉల్లంఘించడం కిందికి వస్తుందని పిటీషన్‌లో పేర్కొంది. ఇప్పటికే పలువురు ప్రముఖలు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పిటీషన్‌ వేశారు.

Related Articles