లాభాలన్నీ పాయే… నష్టాల్లో ముగిసిన నిఫ్టి

దాదాపు రెండు శాతం లాభాలతో ప్రారంభమైన నిఫ్టి… చివర్లో నష్టాల్లో ముగిసింది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే నిఫ్టి 9,439 పాయింట్లకు చేరింది…క్లోజింగ్‌కల్లా 12 నష్టంతో 9,239 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 200 పాయింట్లు క్షీణించింది. ఆరంభం నుంచి చివరి వరకు నిఫ్టి క్రమంగా పడుతూ రావడం విశేషం. నిఫ్టి ఆటో ఇవాళ నాలుగు శాతంపైగా పెరిగినా.. బ్యాంకు షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి నిఫ్టి లాభాలను చెరిపేసింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లే. అమెరికా, ఆసియా మార్కెట్లలో ఉన్న లాభాలు యూరో ప్రారంభమయ్యే సరికి రెడ్‌లోకి వెళ్ళిపోయాయి. యూరో సూచీలన్నీ దాదాపు ఒక శాతం నష్టంతో ట్రేడవుతుండగా, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌…

హీరో మోటో కార్ప్‌
టాటా మోటార్స్‌
ఇన్‌ఫ్రాటెల్‌
బజాజ్‌ఆటో
మారుతీ

నిఫ్టి టాప్‌ లూజర్స్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌
బీపీసీఎల్‌
డాక్టర్‌ రెడ్డీస్‌
కొటక్‌ బ్యాంక్‌
హిందుస్థాన్‌ లీవర్‌

Related Articles