బీజేపీ మద్దతుదారులకు ట్విటర్ మళ్ళీ టార్గెట్ అయింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉదయం నుంచి ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నారు. ఆయన ట్వీట్ అకౌంట్‌కు సంబంధించి ట్విటర్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. చివరికి ఇది కూడా బీజేపీ, బీజేపీయేతర మద్దతుదారుల మధ్య గొడవలా మారింది. జరిగిందేమిటంటే… ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రెండు ట్విటర్ అకౌంట్లు ఉన్నాయి. ఒకటి రాష్ట్రపతి హోదాలో ఉన్న అకౌంట్ Vice President of India@VPSecretariat, రెండోది తన పర్సనల్ అకౌంట్ M Venkaiah Naidu @MVenkaiahNaidu. ఇవాళ వెంకయ్య పర్సనల్ అకౌంట్ నుంచి బ్లూటిక్‌ను తొలగించింది ట్విటర్. అంటే ఈ అకౌంట్ వెరిఫైడ్ కాదన్నమాట. ట్విటర్ రూల్స్ ప్రకారం ఏదైనా అకౌంట్ చాలా నెలలు తరబడి యాక్టివ్‌గా లేకుంటే అంటే, పోస్ట్ చేయకుంటే దానికి బ్లూటిక్ తొలగిస్తారు. తన పర్సనల్ ఖాతాలో వెంకయ్య చివరిసారిగా 2020 జులై 23న ట్వీట్ చేశారు. తరవాత ట్వీట్లు లేవు. దీంతో ఆయన అకౌంట్‌కు బ్లూక్ టిక్ తొలగించింది ట్విటర్. నిబంధనల మేరకు ట్విటర్ తొలగించడంలో తప్పేముందని బీజేపీయేతర నెటిజన్లు వాదిస్తుండగా… ఆయన దేశానికి ఉప రాష్ట్రపతి అని, ఆ విషయం ట్విటర్‌కు తెలియదా అని బీజేపీ మద్దతుదారులు ట్వీట్ చేస్తున్నారు. ఈ గొడవ మొదలైన తరవాత వెంకయ్య అకౌంట్‌కు మళ్ళీ బ్లూటిక్ పెట్టింది ట్విటర్…