రేవంత్ రెడ్డి ట్రెండింగ్‌

రేవంత్ రెడ్డి పేరు ఇపుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డిని ఏఐసీసీ ప్రకటించిన వెంటనే ట్విటర్‌లో రేవంత్ రెడ్డి దేశంలోనే ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచారు. రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ పేర్లతో రేవంత్‌ ట్రెండింగ్‌లో సాగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో వినూత్న ప్రచారంతో సంచలనం రేపిండి. వివిధ రకాల ఫోటోలు, వీడియోలతో కొత్త పోకడలకు నాంది పలికింది. తమ నాయకుడు తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

Related Articles