మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానున్నాయి. ఆసియా మార్కెట్ల స్థాయిలో సింగపూర్ నిఫ్టి పెరగడంలేదు. సాధారణంగా లోకల్ అంశాలు పెద్దగా లేకుంటే మన మార్కెట్ హాంగ్‌సెంగ్‌ను ఫాలో అవుతుంది. ప్రస్తుతం హాంగ్‌సెంగ్ 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన 90 నుంచి 100 పాయింట్ల వరకు లాభం ఉండాలి. మరి నిఫ్టిలో ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంటుంది. కాబట్టి నిఫ్టి కదలికలు చాలా కీలకంగా ఉన్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 15,635. కేవలం టెక్నికల్స్ పరంగా చూస్తే నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 15,670. ఈ స్థాయిపైన ఉన్నంత వరకు నిఫ్టికి పరవాలేదు. 15,710 పాయింట్ల వద్ద తొలి ప్రతిఘటన ఉంటుంది. ఆ తరవాతి స్థాయి 15,740. ఈ మధ్యలోకి నిఫ్టి వస్తే అమ్మవచ్చు. అయితే స్టాప్‌లాస్ 15,760గా పెట్టుకోండి. గత కొన్ని రోజులుగా నిఫ్టి చాలా స్తబ్దుగా ఉంది. ఈ కన్సాలిడేషన్ పెరగడానికి కావొచ్చు. తగ్గడానికి కావొచ్చు. కాబట్టి 15,750-60 దాటితే షార్ట్ చేయొద్దు. కీలక స్థాయి అయిన15,670కి దిగువకు వస్తే దగ్గర్లో ఎక్కడా మద్దతు స్థాయి లేదు. 15,560 వరకు సపోర్ట్ లేదు. ఈ పరిస్థితి వస్తుందా అన్నది అనుమానమే. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 15,600-15650 ప్రాంతంలో కొనుగోలు చేసి స్వల్ప లాభాలతో బయటపడొచ్చు. రిస్క్ తీసుకునేవారు టైట్ స్టాప్‌లాస్‌తో కొని అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. కాని దిగువ స్థాయిలో నిఫ్టికి 15500-15550 వరకు మద్దతు లేదు.
Related Articles
కొనసాగిన ర్యాలీ
- December 6, 2023
సెన్సెక్స్ మరో 300 పాయింట్ల డౌన్
- February 28, 2023
కోలుకున్నా… 17400 దిగువకు…
- February 27, 2023
18000 దిగువకు నిఫ్టి
- February 17, 2023
17,800పైన ముగిసిన నిఫ్టి
- January 8, 2022
స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
- January 5, 2022