కీలక నిర్ణయం ప్రకటించిన నాదల్‌

ఈ ఏడాది జరిగే వింబుల్డన్‌ ఓపెన్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్‌ నుంచి వైదొలగుతున్నట్లు టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్ ప్రకటించారు. ఈ ఆటలో సుదీర్ఘకాలం కొనసాగాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇది అంత సులవుగా తీసుకున్న నిర్ణయం కాదని, తన శారీరక పరిస్థితి బట్టి, తన టీమ్‌ సభ్యులతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మాడ్రిడ్‌లో చెప్పారు. ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్‌ సెమి ఫైనల్‌లో నాదల్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే.

Related Articles