గత సోమవారం, నిన్న కూడా నిఫ్టికి 15,600 వద్ద గట్టి మద్దతు లభించింది. ఫెడ్ మీటింగ్ హడావుడి పూర్తయినందున… మళ్ళీ మార్కెట్ పరిస్థితి మొదటికి వచ్చింది. ఫండమెంటల్స్, టెక్నికల్‌ను గమనించడం ప్రారంభమైంది. డే ట్రేడింగ్‌తో పాటు పొజిషనల్ ట్రేడింగ్‌కు 15,600 చాలా కీలకంగా మారింది. నిఫ్టి నిన్న 15,691 వద్ద ముగిసింది. సింగపూర్ నిఫ్టి 60-70 పాయింట్ల లాభం చూపుతోంది. అంటే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,750 లేదా 15,760ని తాకే అవకాశముంది. మరోలా చెప్పాలంటే నిఫ్టి తన తొలి ప్రతిఘటన వద్ద ఓపెన్ కానుంది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 15,775 వద్ద, ఈ స్థాయిని దాటితే తరవాతి ప్రతిఘటన 15,805 వద్ద ఎదురు కానుంది. టెక్నికల్స్ ప్రకారం 15,765-75 వద్ద షార్ట్ చేయొచ్చు. కాని స్టాప్‌లాస్ 15,800. 15,800ని దాటితో నిఫ్టి భారీగా పెరిగే అవకాశముంది. అంటే 15,860 వరకు నిఫ్టికి అడ్డులేదు. కాబట్టి 15800 దాటితే అమ్మొద్దు. నిఫ్టికి అమ్మకాల ఒత్తిడి వస్తే తొలుత 15,729, తరవాత 15,690కి చేరే అవకాశముంది. చిన్న ఇన్వెస్టర్లు ఈ స్థాయిల్లో లాభాలు స్వీకరించడం మేలు. కాని ఈ స్థాయిలో కొనుగోలు చేయొద్దు. ఒకవేళ నిఫ్టి ఈ స్థాయిని కోల్పోతే కాస్సేపు వెయిట్ చేయండి. ఎందుకంటే నిఫ్టికి తదుపరి మద్దతు 15,630 ప్రాంతంలో ఉంది. ఈ స్థాయికి వస్తే 15,610 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయండి. నిఫ్టికి ఈ స్థాయి చాలా గట్టి మద్దతు ఉంది. ఈ స్థాయి కోల్పోతే… మార్కెట్‌కు దూరంగా ఉండండి. పొజిషనల్ ట్రేడర్స్ 15,800 ప్రాంతంలో అమ్మి ఉంటే.. వారు వెయిట్ చేయొచ్చు. పైకి అంతా బాగానే ఉన్నా… ఇపుడు కరోనా థర్డ్ వేవ్ చర్చ ప్రారంభమైంది. ఇంగ్లండ్‌లో థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైంది. మహారాష్ట్ర మరో 2 వారాల్లో లేదా 4 వారాల్లో థర్డ్ వేవ్ వస్తుందని హెచ్చరిస్తోంది. కాబట్టి రిస్క్ తీసుకునేవారు 15,800 ప్రాంతంలో అమ్మండి. కాని ఆ స్థాయిలో మాత్రం కొనుగోలు చేయకండి. ఆల్గో ట్రేడింగ్ లెవల్స్… 15,600 నుంచి 15,800 ట్రేడింగ్ రేంజ్. 15,690 కీలక స్థాయి. వీటిని గమనించి ట్రేడ్ చేయండి.
Related Articles
కొనసాగిన ర్యాలీ
- December 6, 2023
సెన్సెక్స్ మరో 300 పాయింట్ల డౌన్
- February 28, 2023
కోలుకున్నా… 17400 దిగువకు…
- February 27, 2023
18000 దిగువకు నిఫ్టి
- February 17, 2023
17,800పైన ముగిసిన నిఫ్టి
- January 8, 2022
స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
- January 5, 2022