ఉదయం ఊహించినట్లే నిఫ్టి 15,760 ప్రాంతంలో నిఫ్టి ప్రారంభమైంది. కాని ఓపెనింగ్‌లోనే ఒత్తిడి ఎదురు కావడంతో వెంటనే 15,732కి క్షీణించి ఇపుడు 15,736 వద్ద 45 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 32 షేర్లు లాభాల్లో ఉన్నా.. నిఫ్టిలో బలం అంతంత మాత్రమే. పెద్దగా కార్పొరేట్ ఫలితాలు లేకపోవడంతో… నిఫ్టి పూర్తిగా టెక్నికల్స్కు పరిమితమౌతోంది. ఉదయం ఇచ్చిన నిఫ్టి లెవల్స్ మేరకు నిఫ్టి కదలాడే అవకాశముంది. మిడ్ క్యాప్ షేర్లు డల్‌గా ఉండటంతో నిఫ్టిలో జోష్ కష్టంగా కన్పిస్తోంది. బ్యాంక్ నిఫ్టి కూడా ఓపెనింగ్ లాభాలను కోల్పోయింది. ఆల్గో ట్రేడింగ్ లెవల్స్‌ను ఫాలో అవడం ప్రస్తుతం సురక్షితమనిపిస్తోంది. అదానీ షేర్లు ఓపెనింగ్ కాస్త గ్రీన్‌లో ఉన్నా… నిలబడతాయా అన్నది చూడాలి.
నిఫ్టి టాప్ గెయినర్స్
బజాజ్ ఫిన్ సర్వ్ 12,015.75 1.67
అదానీ పోర్ట్స్ 657.30 1.61
ఇన్ఫోసిస్ 1,514.10 1.26
ఇండస్ ఇండ్ బ్యాంక్ 995.95 1.21
టీసీఎస్ 3,352.65 1.05
నిఫ్టి టాప్ లూజర్స్
ఓఎన్జీసీ 122.40 -2.16
టాటా స్టీల్ 1,082.40 -1.93
హిందాల్కో 362.50 -1.83
JSW స్టీల్ 684.90 -1.64
టాటా మోటార్స్ 343.50 -0.62