నిఫ్టి… నిలబడటం కష్టమే…

నిర్మలమ్మ రిలీఫ్‌ మార్కెట్‌కు ఎలాంటి జోష్‌ను కల్పించలేదు. వాస్తవానికి నిన్న ఆర్థిక మంత్రి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభమైన అర గంటకు మార్కెట్‌ ముగిసింది. నిన్ననే పట్టించుకోలేదు. ఇవాళ కూడా అదే ట్రెండ్‌. ఉదయం 15,807వద్ద ప్రారంభమైన నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. 15,787కి చేరిన నిఫ్టి కొన్ని నిమిషాల్లో 15,829కి చేరింది. నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇపుడు 15,807 వద్ద 8 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. 15,840 -15,860 మధ్య నిఫ్టిని అమ్మడమే బెటర్‌. ఈ ప్రాంతంలో నిఫ్టిపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నందున మిడ్‌ సెషన్‌నాటికి నిఫ్టి బలహీనపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి అరశాతం నష్టపోవడంతో నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా పెద్దగా స్పందించడం లేదు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఏషియన్‌ పెయింట్స్‌ 3,013.75 1.03
విప్రో 552.30 0.90
పవర్‌గ్రిడ్‌ 233.50 0.71
ఎల్‌ అండ్‌ టీ 1,524.40 0.66
టాటా మోటార్స్‌ 345.00 0.64

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 687.85 -1.20
హిందాల్కో 379.00 -0.86
ఓఎన్‌జీసీ 121.35 -0.82
ఐసీఐసీఐ బ్యాంక్‌ 645.35 -0.76
గ్రాసిం 1,510.10 -0.69

Related Articles