నిఫ్టి: చివర్లో మళ్ళీ అందిన మద్దతు

ఉదయం స్వల్పంగా ఝలక్‌ ఇచ్చిన నిఫ్టి ఇవాళ కూడా మధ్యాహ్నం 2 నుంచి 2.20 గంటల మధ్య కాస్త నీరసపడింది. దాదాపు 50 పాయింట్లు క్షీణించింది. కాని మళ్ళీ మద్దతు అందడంతో కోలుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయి15,892ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 122 పాయింట్లు పెరిగి 15,885 వద్ద ముగిసింది. నిఫ్టి 0.77 శాతం లాభపడగా, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి ఏకంగా 1.57 శాతం లాభపడింది. బ్యాంక్‌ నిఫ్టి స్వల్ప లాభాలకే పరిమితమైనా ఇతర రంగాల షేర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. నిఫ్టిలో 37 షేర్లు లాభాల్లో క్లోజ్‌ కాగా, 13 నష్టాల్లో ముగిశాయి. యూరో మార్కెట్‌ అర శాతం దాకా లాభాల్లో ఉండటం,అమెరికా ఫ్యూచర్స్‌ పటిష్ఠంగా ఉండటంతో నిఫ్టి ఆరంభం నుంచి పటిష్ఠంగా కొనసాగింది.

 

Related Articles