సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. 17820 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని సెకన్లలో 17823ని తాకింది. ఆ వెంటనే 17,771కి చేరింది. వెరిశి క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి స్థిరంగా 17805 వద్ద అంటే నిన్నటి స్థాయి వద్దే ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అందిన మద్దతుతో నిఫ్టి నిలబడింది. ఇతర రంగాల నుంచి పెద్ద మద్దతు లేదు. నిఫ్టిలో 30 షేర్లు గ్రీన్‌లో ఉన్నా… అంతా నామ మాత్రమే. మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్‌లు కూడా నీరసంగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై కన్పిస్తోంది. నిఫ్టిలో టాప్ లూజర్స్ అన్నీ ఐటీ కంపెనీలే. మరి నిఫ్టి ఏ కంపెనీలు ముందుకు తీసుకెళతాయో చూడాలి. నిఫ్టి మళ్ళీ గనుక పెరిగితే 17,850 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. స్వల్ప ఇంట్రా డే లాభాలు ఖాయమనిపిస్తోంది.
Related Articles
కొనసాగిన ర్యాలీ
- December 6, 2023
సెన్సెక్స్ మరో 300 పాయింట్ల డౌన్
- February 28, 2023
కోలుకున్నా… 17400 దిగువకు…
- February 27, 2023
18000 దిగువకు నిఫ్టి
- February 17, 2023
17,800పైన ముగిసిన నిఫ్టి
- January 8, 2022