బీబీసీపై ఐటీ సోదాలు

ప్రముఖ వార్త సంస్థ బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవి కేవలం సర్వే మాత్రమేనని ఐటీ అధికారులు అంటున్నా… బీబీసీ ఉద్యోగుల ఫోన్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీబీసీ ఆర్థిక లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి. గుజరాత్‌ అల్లర్ల సమయంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర ఉందంటూ అప్పటి బ్రిటీష్‌ అధికారులు భావించారని బీబీసీ ఓ ప్రత్యేక డాక్యుమెంటరీలో పేర్కొంది. భారత్‌లో మైనారిటీలపై తీసిన రెండు భాగాల డాక్యుమెంటరీలో గుజరాత్‌ అల్లర్లలో మోడీ పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. బీబీసీని నిషేధించాలని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా… అందుకో కోర్టు ససేమిరా అంది. తాజాగా బీబీసీపై ఐటీ సోదాలు జరగడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అదానీ వ్యవహారంపై తాము జేపేసీ వేయమని డిమాండ్‌ చేస్తుంటే… ప్రభుత్వం బీబీసీపై దాడులు చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఇతర విపక్షాలు కూడా ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి.

Related Articles