ఇండియా గేట్‌ వద్ద ప్రియాంక నిరసన

జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడికి నిరసనగా ఇవాళ ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద రోడ్డుపై కూర్చొని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ నిరసన తెలిపారు. ఆకస్మికంగా ఆమెతో పాటు ఆరుగురు రోడ్డుపై కూర్చున్నారు. విషయం తెలిసిన వెంటనే వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు కూడా వచ్చారు. ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఈ దేశం ప్రతి ఒక్కరిదీ, వారికి నిరసన తెలిసే హక్కు ఉందన్నారు. నిన్న పోలీసుల దాడుల్లో దెబ్బతిన్న విద్యార్థులకు మద్దతుగా తాను నిరసన తెలుపుతున్నానని అన్నారు. విద్యార్థులపై దాడి అంటే దేశ ఆత్మపై దాడి చేసినట్లేనని ప్రియాంక గాంధీ అన్నారు.

Related Articles