ఢిల్లీ పోలీస్‌: 649 పోస్టుల భర్తీ

649 హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఢిల్లీ పోలీస్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్‌ సీలో భాగంగా అసిస్టెంట్‌ వైర్‌లెస్‌ ఆపరేటర్‌/టెలి ప్రింటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తున్నారు.తాజా ఖాళీల భర్తీ కోసం డిసెంబర 28 నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 27. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గత నెల డిసెంబర్‌ 22న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో చూడొచ్చు. కనీస విద్యార్హత పదవ తరగతి. మొత్తం ఖాళీల్లో 392 పోస్టులు పురుషులకు, 193 పోస్టులు మహిళలకు రిజర్వ్‌ చేశారు. దరఖాస్తు ఫీజు రూ. 100.ఎస్సీ, ఎస్టీ, మాజీ ఉద్యోగులత పాటు మహిళలు ఈ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

Related Articles