రూట్‌ మొబైల్‌కు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రొవైడర్‌ అయిన రూట్‌ మొబైల్‌ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నుంచి అనుమతి లభించింది. పబ్లిక్ ఆఫర్‌ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. పబ్లిక్‌ ఆఫర్‌లో భాగంగా ప్రమోటర్లయిన సందీప్‌ కుమార్‌ గుప్తా, రాజ్‌దీప్‌ కుమార్‌ గుప్తాలు సుమారు రూ. 360 కోట్ల విలువైన తమ షేర్లను అమ్ముతుండగా, కొత్త ఈక్విటీ ద్వారా రూ. 240 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తంలో అధిక భాగం మొత్తాన్ని కొన్ని రుణాలను తిరిగి చెల్లించడంతోపాటు కొత్త టేకోవర్‌లకు అడ్వాన్స్‌ ఇచ్చేందుకు వినియోగిస్తారు. కొత్త ఆఫీసు భవనాన్ని కొనుగోలు చేయాలని కూడా కంపెనీ భావిస్తోంది.2004లో ఏర్పడిన ఈ కంపెనీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ విభాగంలో వివిధ కంపెనీలకు సేవలు అందిస్తోంది. ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) కంపెనీలకు, మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీలకు రూట్‌ సేవలు అందిస్తోంది.

Related Articles