అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ మార్కెట్ నుంచి రూ. 1000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఈ మేరకు అనుమతి కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి కోసం డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీఓలో రూ. 400 కోట్లు కొత్త ఈక్వీటీ ద్వారా రూ.600 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఆఫర్ ఫర్ సేల్‌లో కూడా ప్రమోటర్లు రూ. 125.4 కోట్ల విలువైన షేర్లను అమ్ముకుంటున్నారు. అపీజే ప్రైవేట్ లిమిటెడ్ రూ.354.9 కోట్ల విలువైన తన షేర్లను ఈ ఆఫర్ ద్వారా అమ్మేయదలచింది. పబ్లిక్ ఆఫర్ ద్వారా వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని రుణాల చెల్లింపు కోసం ఉపయోగిస్తారు.ఈ ఇష్యూకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.