పెద్ద సినిమాలు థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆరువారాల తరువాతే ఓటీటీలో విడుదల చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం డిమాండ్ చేసింది. థియేటర్లు, ఓటీటీల్లో సినిమాల విడుదలకు మధ్య అంతరాన్ని కచ్చితంగా పాటించాలని తెలిపింది. చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, తెలుగు చలన చిత్ర నిర్మాతలు మండలి సమావేశమైంది. ప్రస్తుతం సినిమాల విడుదలకు సంబంధించి సింగిల్ స్క్రీన్‌లలో రెంటల్ విధానం అమలవుతుండగా మల్టీప్లెక్స్‌లలో పర్సంటేజీ విధానం కొనసాగుతున్నది. మల్టిప్లెక్స్ మాదిరిగా సింగిల్ స్క్రీన్‌లలో కూడా పర్సెంటేజి విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి అవసరమైన మార్గాలపై సమావేశంలో చర్చించారు.