మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి నటుడు బాలయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అన్న అంశాన్ని తాను పట్టించుకోనని అన్నారు. టీవీ 9 న్యూస్ ఛానల్‌తో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ…గతంలో మా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ… ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకుని కొందరు విమానాల్లో తిరగారని, ఆ డబ్బుల ఏమయ్యాయని అన్నారు. తమది గ్లామర్ పరిశ్రమ అని… తమ సమస్యలను బహిరంగంగా చర్చించకూడదంటూ… మా కార్యాలయ నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానన్నారు. అందరూ కలిసి ఇంద్రభవనం లాంటి భవనం నిర్మించుకోవచ్చన్నారు. పరిశ్రమకు చెందినవారు ఇపుడున్నవారు రాసుకుపూసుకు తిరుగుతున్నారని, ఒక ఎకరం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా అని ప్రశ్నించారు.