చరిత్ర సృష్టించిన సింధూ

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి రికార్డుకెక్కింది. వరుసగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌జియావో (చైనా)ని వరుస సెట్లలో (21-13, 21-15) ఓడించింది. ఫలితంగా రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తర్వాత వ్యక్తిగతంగా రెండు ఒలింపిక్‌ మెడల్స్‌ అందుకున్న అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. సింధూ ఇవాళ్టి పతకంతో ఇప్పటి వరకు భారత్‌ టోక్యో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు వచ్చాయి. ఇది వరకే వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానూ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.

Related Articles