అప్రూవర్‌గా మారిన సిసోడియా పీఏ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాతో సన్నిహిత సంబంధాలు ఉన్న దినేష్‌ అరోరా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీబీఐ పిటీషన్‌ దాఖలు చేసింది. మనీష్‌ సిసోడియా తన పర్సనల్‌ అసిస్టెంట్‌ అని దినేష్‌ అరోరా నిన్న ట్వీట్‌ చేశారు. అతన్ని బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దినేష్‌ అరోరా 11వ నిందితునిగా సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. ఢిల్లీకి చెందిన దినేష్‌ అరోరా లిక్కర్‌ లైసెన్స్‌ కోసం వివిధ కంపెనీల నుంచి ముడపులు తీసుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. ఇండోస్పిరిట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ మహేంద్రు నుంచి దినేష్‌ అరోరాకు సంబంధం ఉన్న రాధా ఇండస్ట్రీస్‌ కంపెనీకి కోటి రూపాయలు బదిలీ అయినట్లు కూడా సీబీఐ పేర్కొంది. దినేష్‌ అరోరాను అప్రూవర్‌గా అనుమతించాలని కోరుతూ సీబీఐ పిటీషన్‌ దాఖలు చేసింది. సీబీఐ స్పెషల్‌ కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట ఈ పిటీషన్‌ ఇవాళ విచారణకు రానుంది.

Related Articles