ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా అరెస్ట్‌

లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన్ను సీబీఐ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మ‌ళ్లించారు. అంత‌కుముందు లిక్కర్ స్కామ్ కేసులో విచార‌ణ‌కు ఈ నెల 19న హాజ‌రు కావాల‌ని మ‌నీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు కోరారు. తానే ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వస్తున్నందున వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సర బ‌డ్జెట్ రూప‌క‌ల్పన‌లో నిమ‌గ్నమైనందున త‌న‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని సీబీఐ అధికారుల‌ను మ‌నీశ్ సిసోడియా కోరారు. దీనికి అంగీక‌రించిన సీబీఐ అధికారులు ఆదివారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. ఆదివారం ఎనిమిది గంట‌ల పాటు విచారించిన త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు ప్రక‌టించారు.

Related Articles