మెదక్ లాకప్ డెత్‌పై డీజీపీ సీరియస్‌

రాష్ట్రంలో సంచలనంగా మారిన మెదక్‌ లాకప్‌డెత్‌ ఘటనపై డీజీపీ అంజనీకుమార్‌ సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తునకు డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేఫథ్యంలోనే సీఐ, ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే.. మెదక్‌లో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసులో పోలీసుల ఖదీర్ ఖాన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. నిందితున్ని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు గాంధీ ఆస్పత్రిలో చేరిన బాధితుడు.. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి మరణించాడు. తన భర్త మృతికి పోలీసులే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్యతో పాటు కుటుంబసభ్యులంతా డిమాండ్ చేశారు. మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

Related Articles