ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వసతులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థినులకు ఒక్కటే మూత్రశాలా? అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలపై ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇంటర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎస్, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విద్యాసంస్థల్లోని వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Related Articles
బీజేపీ ఎంపీ అర్వింద్‌కు ఊరట
- February 18, 2023
అయ్యన్న పాత్రుడికి ఊరట
- November 9, 2022
రేపు పండుగ… ఇవాళ నిషేధమా?
- November 13, 2020