బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీచేసింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైపై అవమానకరమైన రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. ఆ వాఖ్యలను సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టనుంది. మంగళవారం జరిగే విచారణకు హాజరై, వివరణ ఇవ్వాలని కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్ ద్వారా తెలియజేసింది.