ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ షాక్ తగిలింది. స్నూపింగ్ కేసులో ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా.. ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం పంపారు. ఈ విజ్ఞప్తికి హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా.. ఇప్పుడు స్నూపింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.