ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను సీబీఐ ద్వారా అరెస్టు చేయించిందన్నారు. ఈ చర్య ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిందే తప్ప మరొకటి కాదన్నారు. ఢిల్లీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కేసీఆర్ స్పందించడం ఇదే తొలిసారి. సిసోడియా అరెస్టును ఝార్ఖండ్ సీఎం సోరెన్ తప్పుపట్టారు. ఈ చర్య ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కడమేనని పేర్కొన్నారు. కేరళ సీఎం విజయన్.. సిసోడియా అరెస్టును ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. దేశంలో ప్రస్తుతం భయానక, హింసాత్మక వాతావరణం ఉందని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు.
Related Articles
గుడివాడ ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ
- March 3, 2023
కొండగట్టు ఆలయంలో చోరీ.. దొంగలు ఎవరంటే?
- February 27, 2023
ఢిల్లీ డిప్యూటీ సీఎంకు భారీ షాక్
- February 22, 2023
వైఎస్ షర్మిల అరెస్ట్
- February 19, 2023
తారకరత్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- February 19, 2023
అద్భుత క్షేత్రంగా కొండగట్టు
- February 16, 2023