చెరువులో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

 

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో పడవ బోల్తా పడిని విషయం తెలిసిందే. వారిలో ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కళ్యాణ్, ప్రశాంత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో నలుగురి కోసం ముమ్మరంగా చెరువులో గాలిస్తున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వగ్రామం తోడేరులోని చిన్నచెరువులో షికారుకెళ్లిన 10 మంది యువకుల్లో ఆరుగురు గల్లంతయ్యారు. మరో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం సుమారుగా 5.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. రాత్రి పొద్దుపోయేనాటికి అందిన సమాచారం మేరకు… ఆదివారం సెలవు కావడంతో తోడేరు గ్రామంలోని యువకులు 10 మంది చిన్నచెరువుకు వెళ్లారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ చెరువులో చేపలకు మేతవేసే పడవలో వారంతా షికారుకు వెళ్లారు. దాదాపుగా మధ్యకు వెళ్లిన తరువాత పడవలోకి నీరు చేరింది. పడవ మునిగిపోతుందని గ్రహించిన యువకులు చెరువులోకి దూకేశారు. అక్కడ లోతు గరిష్ఠంగా 20 అడుగుల వరకూ ఉంటుందని అంచనా. పడవ నుంచి దూకేసిన ఆ 10 మందిలో సురేంద్ర, బాలాజీ, కల్యాణ్‌, శ్రీనాథ్‌, రఘు, ప్రశాంత్‌ గల్లంతయ్యారు. విష్ణు, కిరణ్‌, మహేంద్ర, మహేశ్‌ ఒడ్డుకు చేరుకున్నారు.

Related Articles