నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందించిన ఆమె ‘చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే, అది వాళ్ల జీవితాంతం భయానికి గురిచేస్తుంది. నా కన్న తండ్రే నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అప్పుడు నా వయస్సు కేవలం ఎనిమిదేళ్లు. నాపై జరుగుతున్న ఈ అకృత్యాలను బయటపెట్టేందుకు ధైర్యం ఉండేది కాదు. ఈ విషయాన్ని బయటపెడదామంటే మా అమ్మ నమ్మదేమో అని బాధపడేదాన్ని. ఎందుకంటే ఆమె భర్తే ప్రత్యేక దైవం అన్నట్లు ఉండేది. కానీ నాకు పదిహేనేళ్లు వచ్చాక ఆ బాధను భరించలేక తండ్రిని ఎదిరించాను. దీంతో ఆయన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. అప్పుడు మేం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ధైర్యం కూడగట్టుకొని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను’ అని ఖుష్బూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.