ప్రముఖ నటి సుస్మితాసేన్ గుండెపోటుకు గురయ్యారు. డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. ఈ విషయం సుస్మితాసేన్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేశారు. రెండు రోజుల క్రితమే గుండెపోటు వచ్చిందని, వైద్యులు చికిత్స అందించారని ఆమె అభిమానులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న ఫొటోని షేర్ చేశారు. ‘‘నాన్నెప్పుడూ హృదయాన్ని సంతోషంగా ఉంచు. కష్టకాలంలో నీకు అండగా నిలుస్తుంది అని చెప్పేవారు. ఆ మాటలన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి. నాకు వైద్యం చేసిన డాక్టర్ ‘మీ గుండె చాలా గట్టిది’ అంటూ కితాబిచ్చారు.. అంటూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. తన ఆరోగ్యం గురించిన సరైన సమాచారం అభిమానులకు తెలియాలనే ఈ పోస్ట్ పెడుతున్నానని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానంటూ, భయపడాల్సిన పనిలేదంటూ అభిమానులకు ధైర్యం చెప్పారు.