గొల్లపూడికి చిరంజీవి నివాళి

దిగ్గజ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు పార్థివదేహానికి నటుడు చిరంజీవి నివాళులు అర్పించారు. చెన్నైలోని శారదాంబల్‌లో ఉన్న గొల్లపూడి నివాసానికి వెళ్లిన ఆయన గొల్లపూడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ స్మారకార్థం అందిస్తున్న అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో కలిశాను. అదే చివరిసారి చూడటం. ఆయన పార్థివదేహాన్ని చూస్తానని అనుకోలేదు. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుత క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. తొలినాళ్లలో ‘ఐ లవ్యు’ సినిమా చేస్తున్నప్పుడు.. డైలాగులు ఆయన దగ్గరే నేర్చుకున్నాను. కొన్ని వారాల పాటు శిష్యరికం చేశాను. నాకు గురుతుల్యులు. నేను హీరోగా నటించిన ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా జీవితం మొదలుపెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే నాకు గురువు. గొల్లపూడి దూరమవ్వడం తీరనిలోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అన్నారు.

Related Articles