అది కిట్‌ పొరపాటు.. చిరుకు కరోనా లేదు

కిట్‌ పొరపాటు కారణంగా పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. తనకు కరోనా సోకిందని తెలియగానే ప్రాథమిక వైద్యం తీసుకున్న తరవాత … రెండు రోజులైనా కరోనా లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్‌ని సంప్రదించి పరీక్షలు జరిపించినట్లు చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌లో ఏమన్నారంటే…

‘కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను confuse చేసి , నాతో ఆడేసుకున్నాయి . ఆదివారం టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ అన్న తరవాత , basic medication start చేసాను , రెండు రోజులైన ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి , నాకే అనుమానం వచ్చి , అపోలో డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను , వాళ్ళు అక్కడ CT స్కాన్ తీసి chest లో ఎలాంటి traces లేవు అన్న నిర్ధారణకు వచ్చారు , అక్కడ రిజల్ట్ negative వచ్చాక , మరొక్కసారి , మరోచోట నివృత్తి చేసుకుందామని , నేను Tenet lab లో 3 రకాల కిట్స్ లతో టెస్ట్ కూడా చేయించాను . అక్కడా negative వచ్చింది . Final గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా RT PCR టెస్ట్ చేయించాను . అక్కడ కూడా negative వచ్చింది . ఈ మూడు రిపోర్టుల తరవాత మొదటి రిపోర్ట్ faulty kit వలన వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకి వచ్చారు . ఈ సమయంలో మీరందరు చూపించిన concern , ప్రేమాభిమానాలకి , చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

 

Related Articles