కేటీఆర్‌ సార్‌… మీరు సినిమాల్లో నటించరూ…!

మీరు సందేశాత్మకం సినిమాల్లో నటించాల్సిందిగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు… నాకు ఫుల్‌టైమ్‌ జాబ్‌ ఉందని సమాధానం ఇచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ట్విట్టర్‌లో ‘ఆస్క్‌ కేటీఆర్‌’ పేరుతో ఆయన అభిమానులతో మాట్లాడారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై స్పందిస్తూ… దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఏపీ ప్రజలేనని ఆయన అన్నారు. ఏపీలో 6 నెలల్లో జగన్‌ పరిపాలన బాగుందని ఆయన ప్రశంసించారు. చేవేళ్ళ, మెయినాబాద్‌ ప్రజలు జీవో 111 జీవో ఎత్తివేతపై ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నారంటూ వేసిన ప్రశ్నకు… ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేటీఆర్ చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడం పెద్ద సవాల్ అన్నారు. తనను అధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు కేసీఆరే అని పేర్కొన్నారు…. కొత్త ఏడాది డిసెంబర్‌ 31 రాత్రి పార్టీ సార్‌ ఓ అభిమాని ఆఫర్‌ చేస్తే… థ్యాంక్స్‌ ఫర్‌ ఆఫర్‌ అని సమాధానం ఇచ్చారు.
ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను బ్యాలెన్స్‌ చేస్తాయని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. నచ్చిన కొటేషన్‌ గురించి కేటీఆర్‌ చెబుతూ…
‘జీవితమంటే…మనం ఎంత గట్టిగా పంచ్‌ కొట్టామనేది కాదు. మన ఎన్ని పంచ్‌లను తట్టుకుని..ఇంకా ముందుకు ఎలా వెళ్ళగలిగామన్నద’ని అన్నారు. వచ్చే ఏడాది కచ్చితంగా ఫార్మాసిటీ ప్రారంభమౌతుందన్నారు. బీజేపీ విభజన రాజకీయాల గురించి వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ… తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని, అలాంటి విభజనవాదులను ఓడిస్తారన్నారు. రాజకీయాలను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయడం కష్టమని, ఇంకా ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్‌ చేసిన నేత నాకు ఎవరూ కన్పించలేదన్నారు.

Related Articles