కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ!

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, సెకండ్‌ వేవ్‌లో ప్రభుత్వ ఇమేజీ దెబ్బతినడంతో కేంద్ర కేబినెట్‌కు కొత్త రూపు ఇవ్వాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుందని టైమ్స్‌ నౌ ఛానల్‌ పేర్కొంది. ఏపీ సీఎం జగన్‌తో సహా మిత్ర పక్షాలతో ప్రధాని మోడీ భేటీ కావడంతో పరమార్థం ఇదేనని తెలుస్తోంది. యూపీలో రాష్ట్ర కేబినెట్‌ను కూడా అసెంబ్లీ ఎన్నికల్లోగా పునర్‌ వ్యవస్థీకరించే అవకాశముంది. కేంద్ర కేబినెట్‌లో పునర్‌ వ్యవస్థీకరణలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తొమర్‌, విద్యా శాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌పై వేటు పడే అవకాశముందని టైమ్స్‌ నౌ అంచనా. కరోనా, రైతుల విషయంలో ఆయా శాఖలు విఫలమయ్యాయని మోడీ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. జ్యోతిరాదిత్య సింథియాతో పాటు బీహార్‌ నుంచి సుశీల్‌ కుమార్‌ మోడీని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి అమిత్‌షా కూడా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. కోవిడ్‌ కారణంగా దెబ్బతిన్న ప్రతిష్ఠను మళ్ళీ పెంచుకోవడమే గాక, యూపీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేబినెట్‌కు కొత్త జోష్‌ కల్పించాలని మోడీ భావిస్తున్నట్లు జాతీయ మీడియా రాస్తోంది.

Related Articles