ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం

పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్టుతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు నిమ్స్‌కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Related Articles