ఏపీలో ఇపుడున్న బార్ల లైసెన్స్లు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పాతవి రద్దు చేసి… ఇపుడున్నవాటిల్లో 40 శాతం తగ్గించి కొత్త బార్లకు లైసెన్స్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇవాళ బార్ల పాలసీపై సీఎం జగన్ అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశంలోనిర్ణయించారు. స్టార్ హోటళ్లు మినహాయిస్తే రాష్ట్రంలో ఇపుడు 798 బార్లు ఉన్నాయి. బార్లలో మద్యం సరఫరా వేళల్ని కుదించిన ప్రభుత్వం, అక్కడ అమ్మే మద్యం ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. బార్ల పాలసీలో నిబంధనలు అతిక్రమించేవారికి జైలు శిక్ష వేసేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
Related Articles
ఊహించని షాకిచ్చిన చిరు ఉద్యోగులు..
- January 9, 2022
ఫిట్మెంట్ 23.29 శాతం
- January 7, 2022