ఊహించని షాకిచ్చిన చిరు ఉద్యోగులు..

ఏపీలోని అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మెజార్టీ ఉద్యోగులు ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న చిరుద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఉద్యోగంలో చేరి 2021 అక్టోబరు రెండో తేదీకే రెండేళ్లయినా తమకు ఇచ్చిన మాట ప్రకారం ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోగా … ఈ ఏడాది జూన్ 30 లోగా చేస్తామని సీఎం జగన్ ప్రకటించడంపై వారంతా తీవ్ర నిరసన తెలియజేశారు. రోజువారీ కార్యకలాపాలపై ఆదేశాలిచ్చేందుకు మార్గనిర్దేశం చేసేందుకూ జిల్లా సంయుక్త కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు అడ్మిన్లుగా నిర్వహిస్తున్న అధికారిక వాట్సప్ గ్రూపుల నుంచి నిష్క్రమించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా అధికారిక గ్రూపుల నుంచి నిష్క్రమిస్తుండటంతో  అసలు ఏం జరిగిందో ఉన్నతాధికారులకు కాసేపు అర్థం కాలేదు. విషయం తెలిశాక షాక్ తిన్నారు.

Related Articles