ప్రకాష్‌రాజ్‌పై నాగబాబు ఫైర్‌

జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ను ఊసరవెల్లి అంటూ నటుడు ప్రకాష్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. రాజకీయాల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతుంటాయని, వాటి ఉద్దేశం పార్టీకి, ప్రజలకు దీర్ఘకాలిక ఉపయోగాలు ఉంటే చాలా మంచిదంటూ జనసేన పొత్తులను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మధ్యలో ఆయన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించిన నాగబాబు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల పార్టీకి, ప్రజలకు దీర్ఘాకాలిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి…

రాజకీయల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతుంటాయి. బట్.. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్ లో పార్టీ కి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ghmc ఎలక్షన్స్ లో బీజేపీ కి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయటం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు , పార్టీ ప్రయోజనాలు ఉన్నాయిని నా నమ్మకం. ఎవడికి కళ్యాణ్ ద్రోహం చేసాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు . Mr Prakash Raj నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లొనే అర్థం అయ్యింది. సుబ్రమణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ ఉద్దేశ్యం లో బీజేపీ తీసుకొన్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు తప్పులేదు . అలాగే బీజేపీ గాని మరి ఏ పార్టీ గాని ప్రజలకు మంచి చేసినా హర్షించగలగాలి. విమర్శించటం తప్ప మంచి చేస్తే మేచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలం.ఒకటి మాత్రం చెప్పగలను.ఈ దేశానికి బీజేపీ చెప్పగలం.ఒకటి మాత్రం చెప్పగలను.ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీ తో AP కి జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం.నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఆపలేరు.నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బుకోసం హింస పెట్టవో , ఇచ్చిన డేట్స్ ని క్యాన్సల్ చేసి ఎంత హింసకి గురిచేసావో ఇంకా గుర్తున్నాయి ప్రకాష్ రాజ్.ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషి నిస్వార్ధ పరుడైన నాయకుడి ని విమర్శించు. డైరెక్టర్స్ ని కాకా పట్టి నిర్మాతలని కాల్చుకు తిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడ్డం ఏమి తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని నివ్వు నోటికొచ్చినట్లు విమర్శించినా నిన్ను ఎవరు ఏమి అనలేదంటే అది బీజేపీ democracy కు ఇచ్చే విలువ అని అర్థం చేసుకో.బీజేపీ జనసేన ghmc ఎలక్షన్స్ లో కచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్ళు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు.

ఇంతకీ పవన్‌ కళ్యాణ్‌ గురించి ప్రకాష్‌ రాజ్‌ ఏమన్నారో చూడండి…

 

Related Articles