జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక హామీలు ఇచ్చారు.ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు అనేక వరాలు ప్రకటించారు. సినిమా పరిశ్రమకు కూడా రాయితీలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
వాటిలో ప్రధానమైనవి…
- వచ్చే నెల నుంచి 20వేల లీటర్ల వరకు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు.
- 97 శాతం మందికి ఉచితంగా నీరు
- ప్రాంతీయ బాహ్యవలయ రహదారి ( రీజినల్ రింగ్‌రోడ్డు) నిర్మాణం
- ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌ల నిర్మాణం
- నగరం చుట్టూ మరో 3 టిమ్స్ ఆస్పత్రులు
- బస్తీ దావాఖానాల్లో డయాగ్నస్టిక్ సేవలు
- విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు
- రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో
- బీహెచ్ఈఎల్ నుంచి మెహదీపట్నం వరకు మెట్రో
- నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు
- కేశవాపురం జలాశయ నిర్మాణ పనులు ప్రారంభం
- రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి
- రూ.12 వేల కోట్ల అంచనాతో సమగ్ర వరదనీటి నిర్వహణ ప్రణాళిక
- లాండ్రీలు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్
- కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు
- పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్ ఛార్జీల నుంచి మినహాయింపు
- రూ.10కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్మెంట్
- మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక తరహాలో టికెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు