ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. చైర్మన్గా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, డిప్యూటీ చైర్మన్గా జంగా కృష్ణమూర్తిని నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు ముస్లిం మైనారిటీ నేత షరీఫ్ ఆ పదవిలో ఉన్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు మళ్లీ ముస్లిం మైనారిటీ నేతకే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మండలి చైర్మన్ షరీఫ్ పదవీ కాలం పూర్తయింది. ఇటీవలే ఆయనకు ఘనంగా వీడ్కొలు పలికారు. ఇక డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీకాలం 18తో ముగియనుంది. ఆయన స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడైన జంగా క్రిష్ణమూర్తికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.