RRR దోస్తీ మ్యూజిక్‌ వీడియో ఇదిగో…

సినీ పరిశ్రమలో ఆర్‌ఆర్‌ఆర్‌ హంగామా మొదలైంది. ప్రి రీలీజ్‌ పండుగకు తెర లేచింది. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని దోస్తీ మ్యూజిక్‌ వీడియోను చిత్ర యూనిట్‌ ఇవాళ విడుదల చేసింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లపై చిత్రీకరంచిన దోస్తీ స్టిల్‌ ఇప్పటికే వైరల్‌ అయింది. ఇవాళ విడుదలైన ఈ పాట వీరి స్నేహబంధానికి సంబంధించినది. అయిదుగురు సింగర్స్‌ అయిదు భాషల్లో పాడగా.. అయిదుగురు ఈ పాట చిత్రీకరణలో ఉండటం విశేషం ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాయగా, హేమచందర్‌ పాడారు. తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ పాట విడుదలైంది.

 

Related Articles